వివేకా కూతుర్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి: సీపీఐ నారాయణ
Advertisement
సీపీఐ నాయకుడు నారాయణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై స్పందించారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయ హత్యగా భావించడంలేదని నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో వివేకా కుమార్తె వ్యవహరిస్తున్న తీరును చూసి అధికార, విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు హుందాతనాన్ని కోల్పోయానని అన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఇక ఈసారి ఎన్నికల్లో తమ కూటమి కీలకపాత్ర పోషిస్తుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తన తండ్రి హత్యకు గురైన తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత ఎంతో ఆవేదనకు గురయ్యారు. కొన్నిరోజుల కిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి తండ్రిపోయిన బాధ కంటే మీడియాలో వస్తున్న కథనాలే ఎక్కువ బాధ కలిగిస్తున్నాయని తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.
Fri, Mar 22, 2019, 07:26 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View