ఎన్నికలు అయ్యాక ఢిల్లీలో చక్రం తిప్పుదాం: సీఎం చంద్రబాబు
Advertisement
త్వరలో జరగబోయే ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు అయ్యాక ఢిల్లీలో చక్రం తిప్పుదామని, ఏపీకి రావాల్సిన నిధులు ఎందుకు రావో చూద్దామని అన్నారు. చోడవరాన్ని కుప్పం కంటే బాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై, ప్రధాని మోదీపై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీని కేసీఆర్ కు తాకట్టు పెట్టినందుకు జగన్ కు ఓటేయాలా? అని ప్రశ్నించారు. పులివెందుల రాజకీయాలను రాష్ట్రమంతా చేద్దామని జగన్ చూస్తున్నాడని, వైసీపీ నేతలు ఇతర పార్టీల నాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీపై సానుభూతి చూపిస్తే మోసపోతామని, ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.
Fri, Mar 22, 2019, 06:33 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View