ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మరో జాబితా విడుదల
Advertisement
ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ముగ్గురు ఎంపీ అభ్యర్థులతో పాటు 45 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వెల్లడించింది. అయితే, ఈ జాబితాలో ప్రకటించిన పేర్లలో సగానికిపైగా అభ్యర్థులు కొత్త వ్యక్తులేనని సమాచారం.

లోక్ సభ స్థానాలకు.. విశాఖపట్టణం నుంచి పేడాడ రమణకుమారి, విజయవాడ నుంచి నరహరిశెట్టి నరసింహారావు, నంద్యాల నుంచి లక్ష్మీ నరసింహయాదవ్ పేర్లను ప్రకటించింది.

ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో.. 

విశాఖ (ఈస్ట్)- వి.శ్రీనివాసరావు, విశాఖ (నార్త్)- జి.గోవిందరాజు, విశాఖ (వెస్ట్)- పి.భగత్, అనకాపల్లి- రామగంగాధరరావు, పిఠాపురం-ఎంవీ శ్రీనివాస్, రాచంద్రాపురం-ఐ.సతీశ్ కుమార్, కొత్తపేట- ఎం. రామకృష్ణారావు, భీమవరం- శేఖర్ బాబు దొరబాబు, నూజివీడు-బీడీ రవికుమార్, విజయవాడ (వెస్ట్)- రత్నకుమార్, విజయవాడ (సెంట్రల్)-వి.గురునాథం, విజయవాడ (ఈస్ట్)-పి.నాంచారయ్య, పెదకూరపాడు-పి, నాగేశ్వరరావు, తాడికొండ- విజయ్ కుమార్, పొన్నూరు-జేఎన్ఎస్ వరప్రసాద్, రేపల్లె-మోపిదేవి శ్రీనివాస్ రావు, బాపట్ల-మొహిద్దీన్ బేగ్, గుంటూరు (వెస్ట్)- ఎస్.రోహిత్, గుంటూరు (ఈస్ట్)- జగన్మోహన్ రెడ్డి, సత్తెనపల్లి- చంద్రపాల్, వినుకొండ-అట్లూరి విజయ్ కుమార్, పర్చూరు-పి.జానకిరామ్, చీరాల- డి.రంగారావు. 
Thu, Mar 21, 2019, 09:53 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View