మంగళగిరిలో మంచి మెజార్టీతో లోకేశ్ గెలుస్తాడు: దివ్యవాణి
Advertisement
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంచి మెజార్టీతో లోకేశ్ గెలుస్తాడని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో లోకేశ్ పోటీ చేస్తున్న విషయమై ఆమెను ప్రశ్నించగా, సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని, ఏది మంచి, ఏది చెడు అన్న విషయం ఆయనకు తెలుసని అన్నారు. చంద్రబాబు చెప్పారంటే.. ‘మైనస్’ ని కూడా ‘ప్లస్’ గా మార్చుకోవడానికి తాము కృషి చేస్తామని చెప్పారు.

ప్రతిపక్ష నాయకుల్లాగా లోకేశ్ భూ కబ్జాలు చేయలేదని, ఆయనేమీ నేరస్తుడు కాదని, ఆయన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని అన్నారు. ఎన్టీఆర్ కు మనవడిగా, బాలకృష్ణకు అల్లుడిగా, సీఎం చంద్రబాబునాయుడి కొడుకుగా లోకేశ్ కూడా ఎన్నో భూ కబ్జాలు చేయొచ్చు, కావాలంటే, విదేశాల్లో స్థిరపడొచ్చు కానీ, ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన తాపత్రయం అని చెప్పారు.  
Thu, Mar 21, 2019, 06:44 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View