తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున తనయుడు విష్ణు భారీ విరాళం
Advertisement
Advertisement
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మోహన్ బాబు తనయుడు హీరో విష్ణు తన ఉదారతను చాటుకున్నాడు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి కోటి రూపాయల భారీ విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరిచే నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళం మొత్తాన్ని మూడేళ్ల కాలంలో అందజేస్తానని ఓ ట్వీట్ లో విష్ణు పేర్కొన్నారు.

Tue, Mar 19, 2019, 10:07 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View