వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్
Advertisement
Advertisement
వైఎస్ వివేకా హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టును జగన్ ఆశ్రయించారు. ఈ మేరకు ఈరోజు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుునాయుడు, డీజీపీ ఠాకూర్ ప్రమేయం లేని స్వతంత్ర సంస్థకు కేసు అప్పగించాలని ఆ పిటిషన్ లో కోరారు.

వివేకా హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం యత్నిస్తున్నారని, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం లేదని, అందుకే, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు విచారణను అప్పగించాలని జగన్ కోరారు.    
Tue, Mar 19, 2019, 10:01 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View