ఈ నెల 21న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తా: సీఎం కేసీఆర్
Advertisement
ఈ నెల 21న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి టీఆర్ఎస్ కు విజయం అందించారని, అదే మాదిరిగా, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. పదహారుకు పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరాలని, ఆ బలంతో రాష్ట్రాన్ని మరింత బాగుచేసుకుందామని, అందుకు, ప్రజల దీవెనలు తమకు కావాలని కేసీఆర్ కోరారు.
Tue, Mar 19, 2019, 09:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View