చంద్రబాబు బుజ్జగింపుతో మనసు మార్చుకున్న శ్రీశైలం టీడీపీ అభ్యర్థి
Advertisement
Advertisement
కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సీఎం చంద్రబాబు బుజ్జగింపుతో ఆయన తన మనసు మార్చుకున్నారు. తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈరోజు కర్నూలులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుని ఆయన కలిశారు. శ్రీశైలం నుంచి పోటీ చేయమని రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని తన అనుచరులు, కార్యకర్తలతో రాజశేఖర్ రెడ్డి  చెప్పినట్టు సమాచారం.
Tue, Mar 19, 2019, 08:59 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View