క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట
Advertisement
2013 ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ క్రికెటర్ శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో శ్రీశాంత్ కు ఊరట లభించింది. బీసీసీఐ అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం... శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం చాలా కఠినమైనదిగా అభివర్ణించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ నిషేధంపై మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది.

టీమిండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఇటీవల హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న శ్రీశాంత్ రన్నర్ అప్ గా నిలిచాడు.
Fri, Mar 15, 2019, 11:50 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View