టీడీపీ అధిష్ఠానమే సాధినేని యామిని ఆడియోను లీక్ చేయించింది!: ఐవైఆర్ సంచలన ఆరోపణ
Advertisement
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆడియో లీక్ ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమరావతిలోని ప్రజావేదిక వద్ద ప్లకార్డులతో ఆందోళన చేసేందుకు కొంతమంది బ్రాహ్మణులను తీసుకురావాలని యామిని చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.

యామిని గారి ఆడియోను టీడీపీ అధిష్ఠానమే పచ్చ మీడియాకు లీక్ చేసిందని ఐవైఆర్ ఆరోపించారు. ఇలాంటి దరిద్రపు లీకేజీల విషయంలో టీడీపీ అధిష్ఠానానికి, యెల్లో మీడియాకు పేటెంట్ హక్కు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలపై దాడిచేయడానికి యామిని వాగ్ధాటి పనికి వచ్చిందనీ, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇలా పక్కన పెట్టారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో స్పందించారు.
Fri, Mar 15, 2019, 11:35 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View