తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కి...నేడు లేదా రేపు ప్రకటన
Advertisement
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా చివరి దశకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఢిల్లీలో ఈరోజు సమావేశం కానున్న స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల అంశంపై తర్జనభర్జన అనంతరం ఏఐసీసీ ఎన్నికల కమిటీకి జాబితాను పంపిస్తుంది. ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ తతంగం పూర్తయ్యాక ఈరోజు రాత్రికి లేదా రేపు అభ్యర్థుల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Fri, Mar 15, 2019, 11:28 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View