విజయ్ దేవరకొండ 'హీరో' టైటిల్ వివాదం కానుందా?
Advertisement
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'డియర్ కామ్రేడ్' రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఆనంద్ అన్నామలై ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

ఇక తమిళంలో ఇదే టైటిల్ తో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండకి తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉండటం వలన, అక్కడ కూడా 'హీరో' రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. అక్కడ 'హీరో' టైటిల్ తో శివకార్తికేయన్ చేస్తున్నాడు గనుక, టైటిల్ విషయంలో వివాదం తప్పకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ఒకవేళ శివకార్తికేయన్ టీమ్ ముందుగానే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకుని వుంటే, విజయ్ దేవరకొండ టైటిల్ ను మార్చుకోవలసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Fri, Mar 15, 2019, 10:14 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View