ఉండవల్లి వ్యాఖ్యలు అర్థరహితం: రఘువీరారెడ్డి

28-02-2019 Thu 13:00
advertisement

రాహుల్‌కు ప్రధాని అయ్యే అవకాశాల్లేవని ఏ ప్రాతిపదికన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారని, ఆయన మాటలు అర్థరహితమని పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కంటే ఉండవల్లి చిలక జోస్యం, హస్తసాముద్రికంలు నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాల్లేవని మాజీ ఎంపీ అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement