పుల్వామా దాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన సీఎం యోగి
Advertisement
పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి గురించి మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. లఖ్‌నవూలో ఇంజినీరింగ్ విద్యార్థులతో ఆయన నేడు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పుల్వామా దాడిపై స్పందించారు.

అలాంటి ఘటనలు ఒకదానివెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయని.. కానీ పుల్వామా ఆత్మాహుతి దాడి అత్యంత దారుణమైనదిగా యోగి అభివర్ణిస్తూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. దాడి ఘటనపై విచారణ జరుగుతోందని.. త్వరలోనే పరిస్థితులు  అదుపులోకి వస్తాయన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని.. బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితులన్నింటికి అడ్డుకట్ట వేస్తుందని అన్నారు.  
Sat, Feb 23, 2019, 08:58 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View