ధోనీ భాయ్ రెడీగా ఉండు... చూసుకుందాం!: పంత్ కవ్వింపు
Advertisement
టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి సవాల్ విసిరాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో అమీతుమీ తేల్చుకుందాం అంటూ ఉత్సాహంగా వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ లో స్థానం కోసం గట్టిపోటీ ఇస్తున్న రిషభ్ పంత్ ఐపీఎల్ లో సత్తా చాటడం ద్వారా సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాలని కోరుకుంటున్నాడు. అందుకు చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుతో మ్యాచ్ సరైన వేదిక అని భావిస్తున్నాడు.

పంత్ ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పంత్ హిందీలో మాట్లాడుతూ ధోనీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

"మహీ భాయ్ రెడీగా ఉండు... గేమ్ లో నీ సంగతేంటో చూస్తా" అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు, మహీ భాయ్ తనకు గురువు అని, ఆయనే లేకపోతే తాను వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయ్యేవాడ్నో కాదో తెలియదని అభిప్రాయపడ్డాడు పంత్.

కానీ ఐపీఎల్ లో ఈసారి ధోనీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నానని, తన బ్యాటింగ్ చూస్తే ధోనీ కూల్ గా ఉండలేకపోవచ్చేమో అంటూ కవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ వీడియో చివర్లో ధోనీ కూడా కనిపించాడు. పంత్ మాటలన్నీ విని ఓ కూల్ లుక్ ఇచ్చాడు. కానీ ధోనీ ముఖంలో ఎలాంటి భావం కనిపించకపోవడంతో, నెటిజన్లు, ఇప్పుడు కూడా కూల్ గానే ఉండాలా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ చేస్తున్నారు.
Sat, Feb 23, 2019, 06:56 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View