సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం.. ఓఐసీ సమావేశానికి గౌరవ అతిథిగా ఆహ్వానం
23-02-2019 Sat 18:15
- ఓఐసి నుంచి భారత విదేశాంగ మంత్రికి ఆహ్వానం తొలిసారి
- ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని కోరిన ఓఐసీ
- ఓఐసీ సమావేశానికి ఆహ్వానం పట్ల హర్షం

భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని సుష్మను కోరింది. ఒక భారత విదేశాంగ మంత్రికి ఓఐసీ నుంచి ఆహ్వానం అందటం చరిత్రలో ఇదే మొదటి సారి కావటం విశేషం.
సుష్మను ఓఐసీ ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జావేద్ అల్ నహ్యాన్ కోరినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ నేడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆహ్వానం ద్వారా యూఏఈతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అంతర్జాతీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. 18.5 కోట్ల ముస్లిం జనాభా ఉన్న భారత్‌ను ఓఐసీ సమావేశానికి ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
More Latest News
చిప్ ఆధారిత పాప్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
6 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
10 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
41 minutes ago

'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!
59 minutes ago

హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
1 hour ago

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
1 hour ago

నిరాశపరిచిన సీనియర్ నటి అర్చన రీ ఎంట్రీ!
1 hour ago
