‘మహానాయకుడు’ సినిమాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు
Advertisement
‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ సినిమాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎదుర్కొన్న సంక్షోభాలపై తీసిన బయోపిక్ ‘మహానాయకుడు’ అని, నేటి తరానికి ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియజెప్పే సినిమా ఇదని అన్నారు. టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఓ సంచలనమని, తెలుగోడు ఢిల్లీని గడగడలాడించిన తీరు అందరికీ ఆదర్శమని కొనియాడారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మనకు స్ఫూర్తి అని చంద్రబాబు పేర్కొన్నారు.
Fri, Feb 22, 2019, 10:06 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View