చెన్నైలోని సవిత ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో అగ్నిప్రమాదం.. హాస్టల్ లో భారీగా తెలుగు విద్యార్థులు.. తప్పిన ముప్పు!

22-02-2019 Fri 11:16
advertisement

తమిళనాడు రాజధాని చెన్నైలోని సవిత ఇంజనీరింగ్ కాలేజీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కళాశాల అబ్బాయిల హాస్టల్ నాలుగో అంతస్తులో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కాలేజీలోని మిగతా అంతస్తులకు సైతం ఈ మంటలు వ్యాపించాయి. కాగా, ఈ కళాశాలలో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంటలను ముందుగానే గమనించిన విద్యార్థులు అప్రమత్తమై బయటకు వచ్చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. కాగా, ఈ ప్రమాదం జరగడానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. మొత్తం ఈ హాస్టల్ లో 8 అంతస్తులు ఉండగా, నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement