కోటయ్య మృతిపై పోలీసుల భిన్నవాదనలపై విచారణ జరిపించాలి: వైసీపీ నేత ఉమ్మారెడ్డి డిమాండ్
Advertisement
గుంటూరు జిల్లా కొండవీడు రైతు కోటయ్య మృతి ఘటనపై పోలీసులు భిన్నవాదనలు వినిపిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కొండవీడులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కోటయ్య అరఎకరం ఇచ్చారని ఒకసారి, నాలుగు ఎకరాలు ఇచ్చారని మరోసారి పోలీసులు చెబుతున్నారని, పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

 పోలీసుల భిన్న వాదనలపై విచారణ చేయించాలని, పోలీసుల దెబ్బలు తాళలేక కోటయ్య ప్రాణాలు విడిచాడని, పోలీసులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని  ఆరోపించారు. కోటయ్య మృతిపై వైఎస్ జగన్ నిజనిర్ధారణ కమిటీ వేశారని, మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేశామని చెప్పారు. కోటయ్య వద్ద పని చేసే పున్నారావును పోలీసులు విచారించాలని, ఈ కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Wed, Feb 20, 2019, 03:07 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View