పాక్ గాయకుడిని తొలగించిన సల్మాన్ ఖాన్
Advertisement
పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని బాలీవుడ్ ఖండించింది. ఇప్పటికే పాకిస్థానీ నటులపై నిషేధం విధించింది. తాజాగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తాజా చిత్రం నుంచి పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాంను తొలగించాడు. తన సొంత బ్యానర్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ద్వారా తెరకెక్కుతున్న 'నోట్ బుక్' చిత్రంలో ఒక పాట కోసం అతిఫ్ అస్లాంను సల్మాన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల్లో ఈ పాట రికార్డింగ్ జరగాల్సి ఉంది. ఈలోపు ఉగ్రదాడి జరగడంతో... దానిని నిరసిస్తూ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన స్థానంలో మరో గాయకుడిని తీసుకోనున్నాడు.
Wed, Feb 20, 2019, 02:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View