ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం.. ఒకరు సజీవదహనం
Advertisement
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ ప్రాంతంలోని రింగ్ రోడ్డుపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మేడ్చల్ నుంచి పఠాన్ చెరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్‌ను (TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరు మీద ఉంది.
Wed, Feb 20, 2019, 01:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View