చిత్తూరు నాగయ్య గారి అంత్యక్రియలకు కూడా డబ్బులేదు: సీనియర్ నటుడు రావి కొండలరావు
Advertisement
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రావి కొండలరావు మాట్లాడుతూ, చిత్తూరు నాగయ్యను గురించి ప్రస్తావించారు. దక్షిణాదిన తొలిసారిగా లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న నటుడు చిత్తూరు నాగయ్యనే. 'బీదలపాట్లు' సినిమా కోసం ఆయన ఆ పారితోషికాన్ని తీసుకున్నారు. అలాంటి నాగయ్యగారు చివరి రోజుల్లో అయిదు వేలు .. ఆరువేలు తీసుకుని చిన్న చిన్న వేషాలు కూడా వేశారు.

ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన చిత్తూరు నాగయ్యగారు చనిపోతే, అంత్యక్రియలకి కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులేదు. చిత్తూరు నాగయ్యగారు చనిపోయారని తెలిసి ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ వచ్చారు. ఆయనంటే వాళ్లిద్దరికీ ఎంతో గౌరవం. చిత్తూరు నాగయ్యగారి అంత్యక్రియలకు డబ్బులేదని తెలిసి, వెంటనే ఎంజీఆర్ ఇచ్చారు. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. ఒకప్పటి ఆయన వైభవాన్ని తలచుకుని నేను చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు. 
Wed, Feb 20, 2019, 01:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View