కోటయ్య ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణం: జనసేన నేత రావెల కిశోర్‌బాబు
Advertisement
కోటయ్య ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకుడు రావెల కిశోర్‌బాబు అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కోటయ్య కుటుంబాన్ని కిశోర్‌బాబు నేడు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదర్చారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫ్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నగదు, ఎకరా భూమి అందించడంతోపాటు కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ తరపున తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించిన ఆయన భవిష్యత్తులోనూ బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
Wed, Feb 20, 2019, 01:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View