కుక్కను ఎందుకు కొడుతున్నావు? అని అడిగిన పాపానికి నోటికొచ్చినట్టు కరిచాడు!
Advertisement
కుక్కను ఎందుకు కొడుతున్నావు? అని అడిగిన పాపానికి సదరు వ్యక్తి కాట్ల కుక్కలా పడి అతనిని కరిచేశాడు. ఈ సంఘటన ఇండోర్ లో జరిగింది. బాబీ అనే వ్యక్తి ఓ వీధి కుక్కను ఇష్టం వచ్చినట్టు కొడుతుండగా చూసిన రవి చౌహాన్ ఇదేం పని? అంటూ అడ్డుకున్నాడు. అదే అతను చేసిన పాపమైంది.

నేను కుక్కను కొడుతుంటే అడ్డురావడానికి నువ్వెవడివి? అంటూ రవిచౌహాన్ పై విరుచుకుపడ్డాడు బాబీ. కుక్కను వదిలేసి రవి చౌహాన్ పైకి దూకాడు. అంతేకాదు, కుక్క కంటే దారుణంగా నోటికొచ్చినట్టు కరిచాడు. రవి చౌహాన్ లబోదిబోమంటున్నా వదిలిపెట్టకుండా కిందపడేసి మరీ కరిచాడు.

వీరిద్దరూ ఇలా కలబడుతుండగానే ఆ కుక్క అక్కడ్నించి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన రవి చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఇండోర్ లోని సంజయ్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Tue, Feb 19, 2019, 09:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View