‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో నాగ చైతన్య
Advertisement
అల్లు అరవింద్, నాగ చైతన్య కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘100% లవ్‌’ సినిమా రూపొందింది. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను నిర్మించనున్నారని టాక్ బాగా నడుస్తోంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహించనున్నారు. నాగచైతన్య గత కొన్ని రోజులుగా పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్‌తో ఈ చిత్ర కథ గురించి చర్చించడానికే వెళ్లారంటూ టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
Tue, Feb 19, 2019, 09:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View