నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దు!: రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..
Advertisement
గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్న తరుణంలో సమీక్ష నిమిత్తం తమ పార్టీ ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తాను చెప్పేది ఒక్కటేనని, ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని, సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాత స్వేదంతోనే బతుకుతున్న సమాజానికి రైతుల ఆర్తనాదాలు మంచివి కావని పవన్ తన ట్వీట్ లో తెలిపారు.


Tue, Feb 19, 2019, 08:59 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View