మార్చి 23 నుంచి ఐపీఎల్.. ఎన్నికల పోలింగ్ తేదీలను బట్టి షెడ్యూల్!
Advertisement
కాసుల వర్షం కురిపించే అత్యంత ఆకర్షణీయమైన లీగ్ గా ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మార్చి 23న ప్రారంభం కానుంది. 12వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కు చెన్నై ఆతిథ్యమిస్తుంది.

అయితే, ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయానికి దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో తొలి రెండు వారాలతో తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం 17 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత తొలి షెడ్యూల్ ను సవరించడం కానీ, లేక తదుపరి షెడ్యూల్ ప్రకటించడం కానీ చేస్తామని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. పోలింగ్ తేదీలకు అనుగుణంగా మ్యాచ్ ల తేదీలను సవరిస్తామని ఐపీఎల్ పాలకమండలి పేర్కొంది.
Tue, Feb 19, 2019, 07:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View