అవుటై.. పెవిలియన్ కి వెళుతూ తన ప్రతాపాన్ని కుర్చీపై చూపించిన అరోన్ ఫించ్... వైరల్ అవుతున్న వీడియో!
Advertisement
ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్‌ ఫించ్ తన ఆగ్రహాన్ని ఓ కుర్చీపై చూపించి, ఇప్పుడు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో భాగంగా మెల్‌ బోర్న్‌ రెనెగేడ్స్‌ కెప్టెన్‌ గా ఉన్న ఫించ్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తో మ్యాచ్ ఆడుతూ రన్ అవుట్ అయిన వేళ ఈ ఘటన జరిగింది. పెవిలియన్‌ లోకి వెళుతూ అక్కడ ఉంచిన ఓ చైర్ పై తన కోపాన్ని ఫించ్ చూపించగా, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను రన్ అవుట్ కావడాన్ని జీర్ణించుకోలేని ఫించ్, రెండు సార్లు తన బ్యాటుతో కుర్చీని బలంగా బాదాడు. దాన్ని విరిచే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోను చూసిన వారంతా ఫించ్ పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. దాన్ని మీరూ చూడండి.
Tue, Feb 19, 2019, 01:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View