మరణించిన రైతు కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు
Advertisement
కొండవీడు కోట ముగింపు ఉత్సవాల సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి సమీపంలో గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (42) అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు కొట్టడం వల్లే కోటేశ్వరరావు చనిపోయాడని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, కోటేశ్వరరావు ఆత్మహత్య పట్ల ఆవేదన వెలిబుచ్చారు. పోలీసుల తీరుతోనో లేక ఇతర కారణాలతోనో మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కోటేశ్వరరావు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Tue, Feb 19, 2019, 12:51 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View