అందరూ అత్యుత్తములే: కొత్త క్యాబినెట్ పై కేటీఆర్ స్పందన!
Advertisement
నేడు తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ అధినేత అత్యుత్తములనే మంత్రులుగా తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో వీరంతా తెలంగాణ ప్రగతి, అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తన సహచరులందరూ తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించనున్నారని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఉదయం 10 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రుల సంఖ్య 11కు చేరింది. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహమూద్ అలీని మంత్రిగా కేసీఆర్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
Tue, Feb 19, 2019, 12:34 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View