ఆ రోజున విజయశాంతి చెప్పడం వల్లనే అలా చేశాను: వై. విజయ
Advertisement
ఎన్నో సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన వై.విజయ, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆర్టిస్టులు .. వాళ్ల సంపాదనను గురించి ప్రస్తావించారు. చాలామంది ఆర్టిస్టులు సక్సెస్ లో వున్నప్పుడు, ఎప్పటికీ తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వలన ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ విషయంలో నేను జాగ్రత్త పడటానికి కారణం విజయశాంతి అనే చెప్పాలి.

విజయశాంతితో కలిసి నేను చాలా సినిమాల్లో నటించాను. ఒకసారి మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తుండగా, "అవకాశాలు ఎప్పుడు ఉంటాయో .. ఎప్పుడు ఉండవో తెలియదు .. ఎప్పటికీ ఆదాయం వచ్చేలా జీవితంలో ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే .. దానిపై రెంట్లు వస్తుంటాయి" అని విజయశాంతి అంది. అది సీరియస్ గా తీసుకుని .. మా వారితో చెప్పి నేను అదే పనిచేశాను. సినిమా అవకాశాలు తగ్గిన తరువాత .. ఆ రెంట్లే మాకు ఆధారమయ్యాయి" అని చెప్పుకొచ్చారు.
Tue, Feb 19, 2019, 11:49 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View