టీటీడీ బోర్డుపై తెలుగుదేశం నేతల ఆగ్రహం.. సభ్యులను అడ్డుకున్న ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్!
Advertisement
తిరుపతిలో సమస్యలను పరిష్కరించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశ మందిరం ఎదుట అధికార టీడీపీ నేతలు ఈరోజు ఆందోళనకు దిగారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు లోక్ సభ సభ్యుడు శివప్రసాద్, తుడా చైర్మన్ నర్సింహ యాదవ్ టీటీడీ బోర్డు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సమావేశం అజెండాలో ఈరోజు స్థానిక సమస్యలను చేర్చకపోవడంపై మండిపడ్డారు.

టీటీడీ బోర్డు సభ్యులను సమావేశానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని బైఠాయించారు. దీంతో స్థానిక సమస్యలపై కూడా చర్చిద్దామని టీటీడీ బోర్డు సభ్యులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. దీంతో ఆలయ, పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Tue, Feb 19, 2019, 11:03 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View