పాక్ తో వరల్డ్ కప్ ఆడకున్నా ఏం కాదంటున్న హర్భజన్ సింగ్!
Advertisement
రానున్న వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఇండియా ఓ మ్యాచ్ ని ఆడనంత మాత్రాన జట్టు విజయావకాశాలపై ఎటువంటి ప్రభావమూ ఉండదని భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఉగ్రదాడులు జరుగుతున్న ఇటువంటి క్లిష్ట సమయంలో భద్రతా దళాలకు జాతి యావత్తూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సైనికుల త్యాగాలను వృథా పోనివ్వరాదని పిలుపునిచ్చాడు.

ఆటలకంటే దేశమే ముఖ్యమన్న సంకేతాన్నిస్తూ, జూన్ 16న పాక్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ ని బహిష్కరించాలని సూచించాడు. క్రికెట్ సహా హాకీ, కబడ్డీ వంటి మరే ఇతర క్రీడలనూ పాక్ తో ఆడరాదని అన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు లీగ్ దశలోనే మిగతా అన్ని దేశాలతో ఆడనుండటం, ఆయా మ్యాచ్ ల ఫలితాలతోనే నాకౌట్ దశకు అవకాశం పొందనుండటంతో పాక్ తో మ్యాచ్ ని బహిష్కరించినా నాకౌట్ చాన్స్ లు తగ్గబోవని హర్భజన్ సింగ్ తెలిపాడు.
Tue, Feb 19, 2019, 10:51 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View