బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు: వైసీపీ నేత తమ్మినేని
Advertisement
ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే తాట తీస్తానన్న ఏపీ సీఎం చంద్రబాబు, బీసీలకు చేసిందేమీ లేదని వైసీపీ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైసీపీ నిర్వహిస్తున్న బీసీ గర్జన సభకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, నాయీ బ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు గతంలో బెదిరించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని విమర్శించారు. వైసీపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు.

కాగా, గన్నవరం నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ బయలు దేరారు. కాసేపట్లో బీసీ గర్జన సభ ప్రారంభం కానుంది. ఈ సభా ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావ్ పూలే ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ ను జగన్ ప్రకటించనున్నారు.
Sun, Feb 17, 2019, 03:18 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View