సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు అవమానం.. రాజస్తాన్ లో నలుగురు కశ్మీర్ యువతుల అరెస్ట్!
Advertisement
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ గత గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జవాన్ల మరణంతో దేశమంతటా విషాద ఛాయలు నెలకొనగా, కశ్మీర్ కు చెందిన కొందరు యువతీయువకులు మాత్రం తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పుల్వామాలో ఉగ్రదాడిని స్వాగతిస్తూ నలుగురు జమ్మూకశ్మీర్ అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రాజస్తాన్ లోని జైపూర్ లో నిమ్స్ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్నతల్వీన్‌ మంజూర్‌, ఇక్రా, జోహ్ర నజీర్‌, ఉజ్మా నజీర్‌ పుల్వామా దుర్ఘటనపై హర్షం వ్యక్తం చేస్తూ తమ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సదరు విశ్వవిద్యాలయంలో నిరసనలు మిన్నంటాయి. ఈ విషయం వర్సిటీ పెద్దలకు తెలయడంతో నలుగురు విద్యార్థినులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Feb 17, 2019, 02:53 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View