కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేయాలి: ఎస్వీ మోహన్ రెడ్డి
Advertisement
వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను టీడీపీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. దీంతో, కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి నారా లోకేశ్ పోటీ చేయాలని కోరారు. అవసరమైతే, లోకేశ్ కోసం తాను సీటు త్యాగం చేస్తానని, మరోచోట టికెట్ అడగనని, పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. అయితే, కర్నూలు సీటు వేరే వాళ్లకు ఇస్తే మాత్రం ఒప్పుకోనని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
Sun, Feb 17, 2019, 01:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View