ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష.. మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన హరీశ్ రావు!
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, కేటీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టీఆర్ఎస్ నేత, హరీశ్ రావు తన మేనమామ కేసీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో హరీశ్ స్పందిస్తూ..‘తెలంగాణ మీ స్వప్నం. ఈ రాష్ట్రం మీ త్యాగఫలం. ఈ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం. ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష. తెలంగాణ జాతిపిత శ్రీ కేసీఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
Sun, Feb 17, 2019, 01:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View