రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం.. చిక్కుకున్న 21 మంది విద్యార్థులు
Advertisement
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న ఓ యూనివర్సిటీ భవనంలోని నాలుగు అంతస్తులు కుప్పకూలాయి. శనివారం జరిగిన ఈ ఘటనతో అధ్యాపకులు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 85 మందిని రక్షించగా, మరో 21 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరమ్మతు పనుల కారణంగానే భవనం కూలినట్టు అనుమానిస్తున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, మెకానిక్స్ అండ్ ఆప్టిక్స్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
Sun, Feb 17, 2019, 08:19 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View