ఆ వీడియోలు ఫేక్... నమ్మకండి!: హైదరాబాద్ పోలీసులు
Advertisement
"హైదరాబాద్, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ బాక్స్ ఊడిపోయి, ఓ మహిళ కింద పడి చనిపోయింది"... గత రెండు మూడు రోజులుగా నగరంలో వైరల్ అవుతున్న ఓ వీడియో సారాంశమిది. తాజాగా, నిన్నటినుంచి రాజేంద్రనగర్ లో బాంబు పెట్టారని, అది ఎప్పుడైనా పేలవచ్చని చెబుతూ మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.

అయితే, ఈ రెండు వీడియోలు ఫేక్ అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జెయింట్ వీల్ వీడియో ఇక్కడిది కాదని, పాత వీడియోను వైరల్ చేస్తున్నారని, వీడియోను ఫార్వార్డ్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముంబైలోని డీమార్ట్‌ స్టోర్‌ లో గతంలో చేసిన మాక్‌ డ్రిల్‌ ను చూపుతూ రాజేంద్రనగర్ లో బాంబు పెట్టారంటున్నారని, ప్రజలు వీటిని నమ్మవద్దని సూచించారు.
Sun, Feb 17, 2019, 07:47 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View