ఒక అవినీతిపరుడి పార్టీలో చేరి మాకు నీతులు చెబుతారా?: టీడీపీని వీడిన నేతలపై దేవినేని ఫైర్
Advertisement
ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేశ్ వంటి అవకాశవాదులు పార్టీలు మారుస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. టీడీపీని వీడి వెళ్లే వాళ్లు వెళ్లాలే తప్ప, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. ఒక అవినీతి పరుడి వద్దకు వెళ్లి, ఆయన పార్టీలో చేరతారా? మీ గ్రామాలకు వెళ్లండి ప్రజలు తగినబుద్ధి చెబుతారంటూ ఓ రేంజ్ లో ఆయన విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ తీరు ఎంతో అవమానకరంగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు చేస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతో స్వచ్ఛంగా కనపడుతున్నారని, తామేమో వందల కోట్లు దోచుకున్నట్టు కనబడుతున్నామని మండిపడ్డారు.

అవకాశవాద రాజకీయాల కోసమే అవినీతిపరులతో చేతులు కలిపారని, ఇలాంటి వ్యక్తులు పార్టీ మారినా తమకు ఎలాంటి నష్టమూ లేదని దేవినేని అన్నారు. అవినీతి గురించి జైరమేష్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.
Sat, Feb 16, 2019, 08:32 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View