విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం: అవంతి శ్రీనివాస్
Advertisement
విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని తాజాగా టీడీపీని విడిచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం తాను పార్టీ మారలేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు.

ప్రతిపక్షబలాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, డబ్బుతో ఏదైనా చేయొచ్చని అనుకుంటే పొరపాటని హితవు పలికారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గంటా గురించి తెలియాలంటే అయ్యన్నపాత్రుడిని అడిగితే సరిపోతుందని, టీడీపీ అధికార ప్రతినిధి అంటే ప్రతిపక్ష నేతలను తిట్టడమేనని సెటైర్లు విసిరారు. తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని తానని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Sat, Feb 16, 2019, 08:09 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View