రాజౌరీలో ఐఈడీ బాంబు నిర్వీర్యం చేస్తుండగా ఆర్మీ మేజర్ మృతి
Advertisement
జమ్మూకశ్మీర్ లో చొరబాటుదారులు అమర్చిన ఐఈడీ బాంబును నిర్వీర్యం చేస్తుండగా ఆర్మీ మేజర్ మృతి చెందారు. ఓ జవాన్ కు గాయాలయ్యాయి. నౌషెరా సెక్టార్ లోని రాజౌరీలో ఈ సంఘటన ఈ రోజు జరిగింది. ఎల్ఓసీకి 1.5 కిలోమీటర్ల లోపల ఈ బాంబును పాక్ చొరబాటుదారులు అమర్చారు. దీనిని గుర్తించిన భద్రతా బలగాలు నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన మరవకముందే ఈ విషాద ఘటన జరిగింది. గత నెల 11న ఇదే సెక్టార్ లో ఎల్ఓసీ వెంబడి ఐఈడీ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. 
Sat, Feb 16, 2019, 06:55 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View