మరోసారి నాగార్జునతో జోడీకడుతోన్న అనుష్క
Advertisement
తెలుగు తెరకి 'సూపర్' చిత్రం ద్వారా అనుష్క పరిచయమైంది. ఆ సినిమాలో కథానాయకుడైన నాగార్జున .. అనుష్కను ఎంతగానో ప్రోత్సహించారు. అందువల్లనే నాగార్జున పట్ల అనుష్క ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరుస్తూ ఉంటుంది. ఈ కారణంగానే నాగార్జున సినిమాల్లో అతిథి పాత్రల్లో సైతం కనిపించడానికి ఆమె వెనుకాడలేదు. అలాంటి అనుష్క .. తాజాగా మరోమారు నాగార్జున సినిమాలో చేయనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

గతంలో తనకి భారీ విజయాన్ని అందించిన 'మన్మథుడు' సినిమాకి నాగార్జున సీక్వెల్ చేస్తున్నారు. తన సొంత బ్యానర్లో నిర్మించే ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఫోటో షూట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. వచ్చేనెల రెండవ వారంలో 'మన్మథుడు 2'ను లాంచ్ చేయనున్నారు. 
Sat, Feb 16, 2019, 11:41 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View