తమిళ 'అర్జున్ రెడ్డి'కి హీరోయిన్ దొరికేసింది
Advertisement
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా .. బాల దర్శకత్వంలో ఈ సినిమాను 'వర్మ' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ధృవ్ జోడీగా మేఘ చౌదరి నటించింది.

అయితే నిర్మాతలైన 'ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్' వారు ఈ సినిమా పూర్తిస్థాయి అవుట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాను విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. ఒక్క ధృవ్ ను మినహా మిగతా వాళ్లందరినీ ఈ ప్రాజెక్టు నుంచి తొలగించారు. మరో దర్శకుడితో మళ్లీ ఫ్రెష్ గా ఈ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక వైపున దర్శకుల పేర్లను పరిశీలిస్తూనే, మరో వైపున హీరోయిన్ గా బాలీవుడ్ భామ 'బణిత సంధు'ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే కొత్త టీమ్ సెట్స్ పైకి వెళ్లనుంది. 
Sat, Feb 16, 2019, 11:08 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View