'పోకిరి' తరహా ట్విస్ట్ తో 'ఇస్మార్ట్ శంకర్'
Advertisement
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందుతోంది. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. నిజానికి ఈ కథను తన కొడుకు కోసమే పూరి తయారు చేసుకున్నాడట. అయితే స్టార్ డమ్ వున్న హీరోతో చేస్తే బాగుంటుందని సన్నిహితులు చెప్పడంతో రామ్ ను సంప్రదించాడట.

ముందుగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి రామ్ కూడా అంతగా ఆసక్తిని చూపలేదట. కానీ కథ విన్న తరువాత .. ముందుగా తాను ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టులను పక్కన పెట్టేసి ఈ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడని చెబుతున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ 'పోకిరి' తరహాలో ఒక రేంజ్ లో వుండేలా పూరి డిజైన్ చేశాడని అంటున్నారు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ లోనే కావలసినంత కామెడీ వుండేలా చూసుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయనకి హిట్ పడటం ఖాయమనే టాక్ కూడా ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
Sat, Feb 16, 2019, 10:46 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View