చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీకి సీఎంగా ఉండటం శోచనీయం: ఆనం
Advertisement
ఏపీకి ప్రధాని అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. నేడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉందని, ఆంధ్రుల పరువు తీసేలా ఉందని ఆయన విమర్శించారు.

చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీకి సీఎంగా ఉండటం శోచనీయమన్నారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రోటోకాల్ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి.. మనకేం కావాలో చెప్పాలి కానీ అవమానించడం సరికాదన్నారు.  

Mon, Feb 11, 2019, 06:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View