దేశీయ మార్కెట్లు నేడు కూడా నష్టాలలోనే
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వదలకుండా వెంటాడుతున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి తరుముతుండడంతో నేడు కూడా మన మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ అనిశ్చిత వాతావరణం కొనసాగడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాలలో కొనసాగి చివరికి నష్టాలతోనే ముగిశాయి.

దీంతో సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి, 36395 వద్ద; నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 10889 వద్ద ముగిశాయి. ఈ క్రమంలో టాటా స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహేంద్ర తదితర సంస్థలు లాభాలు పొందగా; డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎం&ఎం, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.
Mon, Feb 11, 2019, 05:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View