ప్లీజ్.. నా వాట్సాప్ సేవలను పునరుద్ధరించండి.. కంపెనీకి సీఎం రమేశ్ విజ్ఞప్తి!
09-02-2019 Sat 12:03
- వాట్సాప్ సేవలను నిలిపివేసిన కంపెనీ
- నిబంధనలు ఉల్లంఘించారని వ్యాఖ్య
- మరోసారి జాగ్రత్తగా ఉంటానన్న టీడీపీ నేత

తన ఫోన్ నంబర్ కు వాట్సాప్ సేవలను నిలిపివేయడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. తాను నిబంధనల ప్రకారమే వ్యవహరించానని తెలిపారు. పొరపాటున తప్పు జరిగి ఉంటే మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడతానని అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా తన నంబర్ కు వాట్సాప్ సేవలను పునరుద్ధరించాలని కంపెనీని కోరారు. కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరిపేందుకు తనకు వాట్సాప్ అవసరమని వ్యాఖ్యానించారు.
తమ కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు చాలా ఫిర్యాదులు రావడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సీఎం రమేశ్ కు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రమేశ్ పై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని వాట్సాప్ సంస్థ గోప్యంగా ఉంచింది.
More Latest News
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు.... తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...!
3 minutes ago

భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు.. నేటి నుంచి ఐదు రోజుల్లో నాలుగు గ్రహ శకలాలు రానున్నట్టు నాసా వెల్లడి
13 minutes ago

రఘురామకృష్ణరాజు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
11 minutes ago

వరుసగా నాలుగో వారాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు
49 minutes ago

నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
51 minutes ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
58 minutes ago

చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్ పక్కన ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!
59 minutes ago
