సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి నిర్యాణం.. కర్ణాటకలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!
21-01-2019 Mon 15:40
- సిద్ధగంగ మఠాధిపతిగా ఆధ్యాత్మిక సేవలు
- మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
- రేపు సాయంత్రం అంత్యక్రియల నిర్వహణ

సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సిద్ధగంగ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వామి ఆరోగ్యం ఈరోజు విషమించడంతో కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, హోంమంత్రి ఎంబీ పాటిల్ ఆయన్ను పరామర్శించారు.
కాగా శివకుమార స్వామి మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా, రేపు సెలవుగా ప్రకటించింది. మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు శివకుమార స్వామి అంత్యక్రియలు జరుగుతాయని మఠానికి చెందిన అధికారులు తెలిపారు. శివకుమార స్వామి కర్ణాటకలోని శక్తిమంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
45 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
57 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
