తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క నియామకం
Advertisement
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత ఎంపికపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

 కాగా, నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, సీఎల్పీ రేసులో సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ ఈ పదవి దళిత వర్గానికి చెందిన భట్టికే దక్కింది. 2009లో, 2014లో భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మధిర నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 
Fri, Jan 18, 2019, 10:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View